# యాజమాన్య కార్మిక వర్గం మధ్య కుదిరిన ఒప్పందం
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట డిపోలో పనిచేస్తున్న టీఎస్ ఆర్టీసీ హెయిర్ బస్ నడుపుతున్న డ్రైవర్లు, క్లీనర్ల వేతన గడువు డిసెంబర్ 31 2023 తో ముగిసినందున నూతన వేతన అగ్రిమెంటు చేయాలని యాజమాన్యాలకు నోటీస్ ఇచ్చిన పిదప శనివారం ఆర్టీసీ హైర్ బస్ యాజమాన్య యూనియన్ నావిశెట్టి ప్రసాద్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు ఆధ్వర్యంలో యాజమాన్య, కార్మిక సంఘం ప్రతినిధులు మధ్య చర్చలు జరిగి సఫలీకృతమయ్యాయి. ఎక్స్ ప్రెస్ డ్రైవర్ కు 15000 నుండి 18 వేల రూపాయల వరకు, ఆర్డినరీ బస్ డ్రైవర్ కు 13500 నుండి 16 వేల వరకు, క్లీనర్ కు ఒక బస్సుకు 3700 నుండి 4100 వరకు, టెంపరరీ నటుతున్న డ్రైవర్లకు ఎక్స్ ప్రెస్ కు రోజుకి 1200, ఆర్డినరీకి రోజుకు 1100 రూపాయలు ఇవ్వాలని, కార్మికునికి ప్రతినెల 10వ తారీఖు లోపు వేతనం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ పెరిగిన వేతనం 2024 డిసెంబర్ 31 వరకు అమలులో ఉంతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యాల ప్రతినిధులు రాష్ట్ర గౌరవ ఆధ్యక్షులు లక్కం ప్రభాకర్ సదానందం, వినయ్ రెడ్డి,రంగయ్య దినేష్ కార్మికవాక ప్రతినిధులు,డిపో అధ్యక్షుడు మురళి, కార్యదర్శి రమేష్ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కోశాధికారి రాజు, నాయకులు శ్రీను, శ్రీకాంత్, అశోక్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.