Gurukuntla Kiran Receives Ambedkar National Seva Award
అంబేద్కర్ నేషనల్ సేవ అవార్డుఅందుకున్న గురుకుంట్ల కిరణ్.
చిట్యాల, నేటిదాత్రి :
హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సిటీ కల్చర్ ఆడిటోరియం లో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో వ్యవస్థాపకులు చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డులు ప్రధాన చేయడం జరిగింది . అందులో డాక్టర్ ఆకుల రమేష్ మాట్లాడుతూ నిరుపేదలకు తనవంతుగా మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం తో పాటు కరోనా మహమ్మారి విపత్కర సమయంలో సామాజిక ఆరోగ్య కేంద్రం ద్వారా నిస్వార్థంగా అనారోగ్యం బారిన పడినా వారికి సేవా చేయడం
లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు మరియు కళ్యాణ లక్ష్మి ,రైతు బీమా ,పింఛన్ల విషయంలో సరియైన అవగాహన కల్పించి వారికి లబ్ధి చేకూరేలాగా చేయడం జరిగింది.
అంబేద్కర్ యువజన సంఘం చిట్యాల మండల సీనియర్ నాయకులు గురుకుంట్ల కిరణ్* సేవలను గుర్తించి అంబేద్కర్ నేషనల్ సేవా అవార్డు ప్రధానము చేయడం జరిగింది,ముఖ్య అతిథులు డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి డాక్టర్ టీవీ రామకృష్ణ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ప్రొడ్యూసర్ మల్ల రమేష్ శంషాబాద్ ఎంఈఓ డాక్టర్ ఇస్లావత్ కాసన నాయక్ చేతుల మీద స్ఫూర్తి సేవ సమితి ఆధ్వర్యంలో అందించడం జరిగింది . అవార్డు తీసుకున్న అనంతరం తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ పతి,ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత గౌ” శ్రీ” సిరికొండ మధుసూదనాచారి ని కలిసి
కిరణ్ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది,మా సేవలను గుర్తించి అవార్డు అందించిన స్ఫూర్తి సేవా సమితి వారికి పేరుపేరునా కిరణ్ కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
