కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఊర చెరువు వద్ద బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లెల జగన్మోహన్ మాట్లాడుతూ గన్నేరువరం చెరువు కట్టను సుందరీకరించి, నడక మార్గం ఏర్పాటు చేసి, బతుకమ్మ ఘాటును నిర్మించి, మినీ ట్యాంక్ బండ్ ను ఏర్పాటు చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా కాంతాల అంజిరెడ్డి మాట్లాడుతూ గన్నేరువరం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈకార్యక్రమంలో కొట్టె భూమయ్య, గొల్లపల్లి రవి, కొట్టె నర్సయ్య, పుల్లెల రాము, బొడ్డు రాకేష్, దొగ్గలి రాజు, కయ్యం శ్రీకాంత్, కొలుపుల అనిల్, మంగలారపు కృష్ణకాంత్, బొమ్మ శ్రీను, మంగలారపు సాయి, సందనవేణి ఐలయ్య, బోయిని తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.