ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి
ఎండపల్లి మండలంలోని గుల్లకోట జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని వనం శరణ్య ఇటీవల మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో యు,14 విభాగంలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి ఈనెల 16 నుండి 21 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో తెలంగాణ జట్టు తరపున పాల్గొంటుందని పిఈటీ మహేష్, సాయికుమార్ తెలిపారు. తన ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయుడు రాంచంద్రం , గ్రామ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి, ఉప సర్పంచ్ బిసగోని శ్రీను, ఎంపీటీసీ శ్రీజ మల్లేశం, సీనియర్ క్రీడాకారులు బాస మహేష్ (సి ఐఎస్ఎఫ్), మౌనిక,జీవన్ ,అక్షయ్ రాహుల్, మరియు ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు