కె.లక్ష్మణ్ పార్లమెంట్ బోర్డ్ సభ్యులు, రాజ్యాసభ సభ్యులు.
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్, ఖమ్మం, నల్గొండ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని దేశాయిపేట రోడ్డు కె ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన వరంగల్ తూర్పు నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సమావేశం వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ హాజరైనారు. ఈ సందర్భంగా పట్టభద్రులను ఉద్దేశించి లక్ష్మణ్ మాట్లాడుతు, ప్రేమెందర్ రెడ్డి గత 40 యేండ్లుగా నీతి నిజాయితీతో ప్రజల కోసం పనిచేస్తున్నారని, కేంద్రం ప్రభుత్వ సహకారంతో నిరుద్యోగ సమస్యలపై శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకై నిరుద్యోగ విద్యార్థుల సమస్యలపై పోరాడతారని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అధికార పార్టీ పదవి వ్యామోహంతో జరుగుతున్న ఎన్నిక కాబట్టి అధికార ప్రతిపక్ష పార్టీలకు చెప్ప పెట్టులాగా పట్టభద్రులు ఒక్కసారి ప్రేమెందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పొలిటికల్ ఇన్చార్జి మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ పట్టభద్రులు బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి పిఎల్ శ్రీనివాస్, జి.కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు టి.రాజేశ్వరరావు, వన్నాల శ్రీరాములు, పార్లమెంట్ కో కన్వీనర్ అల్లం నాగరాజు, కార్పొరేటర్లు గందె కల్పన, చాడ స్వాతి, సముద్రాల పరమేశ్వర్, భాకం హరిశంకర్, ఎరుకల రఘునారెడ్డి, కనుకుంట్ల రంజిత్, గడల కుమార్, సుమన్ కత్రి, బైరి శ్యామ్, గోక వెంకట్, కుచన క్రాంతి, మార్టిన్ లూథర్, జిల్లా పదాధికారులు, పట్టభద్రులు పాల్గొన్నారు.