కాటారం, నేటి ధాత్రి
శిథిలావస్థలో ఉన్న అతిథి గృహాన్ని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు.
ఈ సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో 5 లక్షల రూపాయల తో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
అనంతరం మండల కేంద్రంలో గల ఆర్ అండ్ బి అతిథి గృహాన్ని పరిశీలించారు.
శిధిలావస్థలో ఉన్న అతిథి గృహానికి మరమ్మతులు చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని దానితోపాటు మరో నూతన అతిథి గృహాన్ని నిర్మించడానికి కావలసిన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు..
ఈ కార్యక్రమంలో కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య ఇతర జిల్లా అధికారులు , ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు