చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని నాలుగవ అంగన్వాడి కేంద్రంలో గ్రోత్ మేళ అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంనకు సూపర్వైజర్ జయప్రద హాజరై ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశాలను తల్లులకు వివరించారు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం డిడబ్ల్యు ఓ డీఎంహెచ్ఓ సూచనల మేరకు పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లల బరువు ఎత్తు ప్రతినెల తీయించుకోవాలని అప్పుడే పిల్లలలో లోప పోషణ గుర్తించి తక్కువ బరువునకు గురి అయినట్లయితే తీసుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు అదనపు ఆహారము వ్యక్తిగత శుభ్రత త్రాగే మంచి నీరు వయసులవారిగా ఇవ్వవలసిన టీకాలు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో 50 మంది పిల్లల బరువు ఎత్తు లు చూడడం జరిగింది.ఈ ప్రోగ్రామ్ లో బాలామృతం, ఎగ్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ ప్రోగ్రాంకు హెల్త్ సూపర్వైజర్ విజిత ఏఎన్ఏం, అంగన్వాడీ టీచర్ జ్యోతి, ఆయా పద్మ,ఆశ వర్కర్ విజయ ఎక్కువ సంఖ్యలో మహిళలు పిల్లలు హాజరైనారు.