
*ఆడబిడ్డలకు కానుక కేసీఆర్ బతుకమ్మ చీరలు
*చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో యాదవ సంఘ భవనం ప్రారంభం, ఓపెన్ జిమ్ ప్రొసీడింగ్స్,మండల కేంద్రంలో గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, బతుకమ్మ చీరలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.గుడిసె లేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.ఆడబిడ్డలకు కానుక కేసీఆర్ బతుకమ్మ చీరలు అని అన్నారు.స్థానిక బిడ్డనైన నన్ను ఆశీర్వదించాలని కోరారు.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు.
ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదు.
పార్టీలకు అతీతంగా నేను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నాని అన్నారు.
అందరికీ అందుబాటులో ఉంటున్న.ఏ ఆపద వచ్చినా నేను అండగా నిలుస్తానని అన్నారు.
60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద హనుమాన్ దేవాలయం కొండగట్టులో రూపుదిద్దబోతుంది. మండల తాసిల్దార్ డి పుష్పలత, ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, జడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య ,సెస్సు డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ లెక్కల సత్యనారాయణ రెడ్డి, స్థానిక సర్పంచ్ గుంటి లత శ్రీ శంకర్, స్థానిక ఎంపిటిసి సాంబ బుచ్చమ్మ లక్ష్మీరాజం, కోరం ఎంపిటిసి డబ్బు మమత సుజన్ రెడ్డి, మానవాడ ఎంపీటీసీ ఐరెడ్డి గీతా మల్లారెడ్డి, ఉపసర్పంచ్ మోతే ఎల్లారెడ్డి ,బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు కట్ట గోవర్ధన్ గౌడ్, బి ఆర్ ఎస్ నాయకులు ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.