మల్కాజిగిరి నాదే..గెలిచేది నేనే: బిజేపి అభ్యర్థి ఈటెల రాజేందర్.

https://epaper.netidhatri.com/view/253/netidhathri-e-paper-4th-may-2024%09/2

 

ప్రచార వివరాలు, విషయాలు నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో ఈటెల రాజేందర్ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..

ప్రతి చోట, ప్రతి నోట కమలం పాటే.

కార్యకర్తలే బిజేపి బలం.

దేశం కోసం ధర్మం కోసం పని చేసేది బిజేపి మాత్రమే.

మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం.

బిఆర్ఎస్ కు కాలం చెల్లింది.

కాంగ్రెస్ పని ఖతమైంది.

మళ్ళీ వికసించేది కమలమే.

మల్కాజిగిరి లో బిజేపి గెలిస్తే పుష్కలంగా నిధులు.

దేశం, రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే బిజేపి గెలవాలి.

అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

కాంగ్రెస్ కు ఓటు అడిగే నైతికతే లేదు.

ఈ పార్లమెంటు ఎన్నికలలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గెలిచేది నేనే నని, ఎగిరేది బిజేపి జెండానే అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు ఈ రోజు దేశం ఇంత ముందంజలో వుందంటే, అంతర్జాతీయ స్థాయిలో శాసించే స్థానంలో వున్నామంటే అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణమన్నారు. మూడోసారి కేంద్రంలో గతం కన్నా ఎక్కువ మెజారిటీతో400 సీట్లతో బిజేపి రికార్డు గెలుపు ఖాయమన్నారు. బిజేపికి కార్యకర్తలే తనకు పెద్ద బలమన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా, నిస్వార్థ పూరితంగా పార్టీ కోసం పని చేసే నాయకులు కేవలం ఒక్క బిజేపిలోనే వుంటారని ఈటెల అన్నారు. దేశం కోసం ధర్మం కోసం పని చేసే గొప్ప యంత్రాంగం బిజేపి సొంతమని కొనియాడారు. నాయకులుగా మేము తిరగలేని ప్రతి గడపకు ఒకటికి నాలుగుసార్లు ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారం చేస్తున్న కార్యకర్తల సేవలు ఎంతో గొప్పగా వున్నాయన్నారు. వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అన్నారు. అంతేకాదు బిజేపిలో పని చేస్తున్నందుకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించమని గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా, వేధిస్తున్నా లెక్క చేయని గుండె ధైర్యం బిజేపి కార్యకర్తల సొంతమని ఈటెల కొనియాడారు. తాను ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఎంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా తన‌ పోరాటం ప్రజలక తెలుసు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రాణాలకు తెగించి నేను పని చేసిన రోజులు ప్రజలు మర్చిపోలేదు. అందుకే ఎక్కడికి వెళ్లినా నన్ను గెలిపించుకోవడం మా కర్తవ్యం అని ప్రజలు ఇస్తున్న భరోసా ఇస్తున్నారు.‌ అది నాకు కొండంత బలాన్నిస్తుందన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలలో తనను ఆశీర్వదించి గెలిపించాలని ఈటెల రాజేందర్ ప్రజలను‌ కోరారు. దేశంలో ఎవరి నోట విన్నా కమలం మాట, పాటే వినిపిస్తుందన్నారు. ప్రతి చోట కమలమే వికసిస్తుందని చెప్పారు. మల్కాజిగిరిలో బిజేపి జెండా ఎగురుతుందన్నారు. తన గెలుపు ఎప్పుడో ఖాయమైందని రాజేందర్ చెప్పారు. తెలంగాణలో బిఆర్ఎస్ కు కాలం చెల్లిందని ఈటెల అన్నారు. నమ్మినందుకు ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పని కూడా పార్లమెంటు ఎన్నికలలో ఖతమౌతుందన్నారు. మల్కాజిగిరిలో వికసించేది కమలమే అన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పేరు ప్రకటించగానే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయని ఈటెల గుర్త చేశారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా ప్రజల గుండెల్లో వున్న నాయకుడుగా ప్రజల్లో ఎంతో నాకు ఎంతో గుర్తింపు వుంది. కేసిఆర్ గుండెల్లో నిద్రపోయిన నాయకుడు ఈటెల రాజేందర్ అని జనం అంటుంటే స్వయంగా విన్నాను. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి, శ్రామిక, పీడిత, కార్మిక వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు ఈటెల రాజేందర్ అని ప్రచారంలో ప్రజలే అంటున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కోసం నిరంతరం తపిస్తూ, పోరాటం చేసే ఈటెల రాజేందర్ ను గెలిపించుకోవడం మన బాధ్యత అని ప్రజలు చెబుతున్నారు. గత ఎన్నికలలో గెలిచిన రేవంత్ రెడ్డి కనీసం మల్కాజిగిరి ప్రజలకు కనీసం ఐదు పనులు చేయలేదని, జనం ముందుకు ఐదు రోజులు కూడా రాలేదని ఈటెల ఆరోపించారు. ‌ఇప్పుడు ఎక్కడో వుండే సునీత మహేందర్ రెడ్డిని నిలబెట్టి రేవంత్ రెడ్డి మొహం చాటేసుకున్నాడు. అది చాలు బిజేపి గెలుపును తేల్చేయడానికి అని ఈటెల చెప్పారు. బిఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైందని ప్రజల్లో ఎప్పుడూ వున్నది, వుండేది ఒక్క బిజేపి మాత్రమే అని ఈటెల అన్నారు. తనను ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఈటెల కోరారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. తెలంగాణ ఐటి కారిడార్, ఫార్మా హబ్, సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో పాటు పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం ఒక్క బిజేపితోనే సాద్యం. దేశ ఉజ్వలమైన భవిష్యత్తు బిజేపి పార్టీతోనే సాధ్యమౌతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పాలన వల్లనే దేశంలో వెలుగులు నిండాయన్నారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేంద్రంలో మూడోసారి బిజేపి అధికారంలోకి రావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎంతో ముందుకు వెళ్తోందని, అన్ని రంగాలలో పురోగమిస్తోందన్నారు. దేశమంతా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నాడు. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు తనను మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.‌ దేశంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి పొరపాటున తెలంగాణలో ఓటేస్తే చేజేతులా మనమే అభివృద్ధిని చెడగొట్టుకున్నట్లౌతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి, అలవి కాని హమీలు ఇచ్చి కాంగ్రెస్ గెలిచిందని ఈటెల విమర్శించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మర్చిపోయాడని, మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు.‌ రేవంత్ రెడ్డికి కేంద్రం నుంచి నిధులు తెచ్చే పరిస్థితి వుండదని అన్నారు. తెలంగాణలో పార్లమెంటు సీట్లు బిజేపి గెలిస్తే పెద్ద ఎత్తున కేంద్ర నిధులు తేవడానికి, తెలంగాణ ను అభివృద్ధి చేయడానికి అవకాశం వుంటుందన్నారు. మల్కాజిగిరి ప్రజలు తనను గెలిపించాలని, కేంద్రం నుంచి ఇతోధికంగా నిధులు తెచ్చి తెలంగాణలోనే మల్కాజిగిరిని నెంబరు వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలిసి ఒప్పించి, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు నిధులు తెస్తానని అన్నారు. తెలంగాణలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు తెప్పిస్తానన్నారు. యువత ఉపాధి కోసం కృషి చేస్తానని ఈటెల రాజేందర్ చెప్పారు. గత ఎన్నికలలో రేవంత్ రెడ్డి ని ప్రజలు గెలిపిస్తే ఒక్క నాడు నియోజకవర్గానికి వచ్చింది లేదు.‌ కేంద్రం నుంచి నిధులు తెచ్చింది లేరు. రూపాయి పని చేసింది లేదు. కరోనా కాలంలో ప్రజల వద్దకు వచ్చింది లేదు.‌ కాంగ్రెస్ తరుపున సాయం చేసింది లేదు. ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డి వైద్య సదుపాయం కల్పించింది లేదు. పేదలను ఆదుకున్నది లేదు. వరదలొచ్చినప్పు కనీసం ప్రజలను పట్టించుకున్నది లేదు. ప్రజలను పరామర్శించింది. కరోనా కాలంలోనైనా, కరువు కాలంలోనైనా, వదరలొచ్చినా ప్రజలకు అండగా నిలిచింది బిజేపి పార్టీయేనని ఈటెల అన్నారు. అందువల్ల నిత్యం ప్రజల్లో వుండే, ప్రజలకు అందుబాటులో వుండే, ప్రజాసేవకే అంకితమైన జీవితం నాదే అని ఈటెల కుండ బద్దలు కట్టినట్లు చెప్పారు. గత రెండు నెలలుగా ప్రజల్లో వున్నది నేనే…ప్రజలను ఒకటికి నాలుగుసార్లు కలిసి, మల్కాజిగిరి సమస్యల మీద అధ్యయనం చేసింది నేనే. అందుకే నాకు సంపూర్ణ విశ్వాసం వుంది. ప్రజల మీద నమ్మకం వుంది. మా బిజేపి నాయకులు, కార్యకర్తలు, బిజేపి అనుబంధ సంస్థల మీద అపారమైన భరోసా వుంది. నేనే గెలుస్తానన్న ఆత్మస్థైర్యం నాలో కలిగింది. అందుకు నాకోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కోసం బిజేపి శ్రేణులు పడుతున్న శ్రమ వృధా కాదు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులలో బిఆర్ఎస్, కాంగ్రెస్‌లను నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్లంతా అవకాశ వాదులు. దేశం కోసం ధర్మం కోసం పని చేసేది బిజేపి ఒక్కటే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!