
-స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించిన గోపా నాయకులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 31
మొగుళ్లపల్లి ఎస్ఐగా నూతనంగా బాధ్యతలను స్వీకరించిన అనతి కాలంలోనే మండలంలోని ప్రజలందరి మన్ననలను పొందుతున్న తీగల మాధవ్ గౌడ్ ను గోపా జిల్లా నాయకులు వేముల మహేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు రాపర్తి సమ్మయ్య గౌడ్, గౌడ సంక్షేమ సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు వేముల కిరణ్ గౌడ్, గౌడ సంఘం మొగుళ్లపల్లి గ్రామ సొసైటీ అధ్యక్షులు బత్తిని రమేష్ గౌడ్ ల నేతృత్వంలో గౌడ సంఘం నాయకులు బుధవారం పోలీస్ స్టేషన్ లోని నూతనంగా నిర్మించిన ఎస్ఐ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి..శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గోపా నాయకులు మాట్లాడారు. పుట్టిన ఊరికి..కన్న తల్లిదండ్రులకు..పేరు ప్రఖ్యాతులను తేవడమే కాకుండా..సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో.. కష్టపడి ఉన్నత చదువులను చదివి..ఉన్నతమైన స్థాయిలో నిలబడి..యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. అలాగే మండలంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా..క్రైమ్ రేట్ పెరగకుండా ఉండేందుకు తమకు ఎల్లప్పుడు గౌడ నాయకుల సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బత్తిని వెంకటేష్ గౌడ్, బొల్లెపల్లి శ్రీనివాస్ గౌడ్, చెక్క నరేష్ గౌడ్ తదితరులున్నారు.