
భారీగా హాజరైన గిరిజనులు
మరిపెడ నేటి ధాత్రి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు మరిపెడ ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఘనంగా నిర్వహించారు.సేవాలాల్ జయంతి ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గిరిజన నృత్యాలతో సేవలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ఎంపీడీఓ కార్యాలయం నుండి ర్యాలీగా నిర్వహించారు. సాధువులు భోగ్ బండార్ నిర్వహించి ప్రసాదాలను అందజేశారు.అనంతరం మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులు కాంగ్రెస్ పార్టీని ఎంతో ఆదరించారని,కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎంతో కృషి చేశారన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో సేవాలాల్ మహారాజ్ అతికొద్ది కాలంలో గుడి నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వపరంగా,పర్సనల్ గా కూడా సహాయం చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రజలకు అందజేశామని,అలాగే మరో రెండు పథకాలు ప్రారంభం చేశారన్నారు.కావున కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి ఎంపీ ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ఆదివాసి చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గిరిజన జాతి ఐక్యత కోసం ఎంతో కృషి చేశారని,మద్యం,మాంసం వీడి జ్ఞానాన్ని పెంపదించుకోవాలని గిరిజనులను ఐక్యం చేసిన మహనీయుడు సేవాలాల్ చూపిన మార్గంలో నడిచి సేవాలాల్ ఆచారాలను పాటించాలన్నారు.డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మాట్లాడుతూ మనిషిగా జన్మించిన సేవాలాల్ గిరిజన జాతి కోసం చేసిన సేవలకు ఈ రోజు ఆరాధ్య దైవంగా పూజించుకుంటున్నామని సేవాలాల్ చూపిన సన్మార్గంలో నడిచి యువత విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే భవిష్యత్తు ఆనందంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బలరాం నాయక్,కాంగ్రెస్ మహిళ నాయకురాలు రాధ బాయి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు యుగంధర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రవి నాయక్, మండల అధ్యక్షులు రఘువీర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్,కాలం రవీందర్ రెడ్డి, గంధసిరి అంబరీష,అజ్మీరా శ్రీను,జరుపుల విజయ్,సాయి, సురేష్ జాటోత్,అధికారులు ఎమ్మార్వో సైదులు,ఎంపీడీఓ రేవతి,వ్యవసాయ శాఖ అధికారి వీర సింగ్,సేవాలాల్ భక్తులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,విద్యార్థిని, విద్యార్థులు ఇంకా తదితరులు పాల్గొన్నారు.