
# మాజీ ఎంఎల్ పెద్ది సుదర్శన్ రెడ్డి.
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మెడికల్ కళాశాలకు అనుబంధంగా సర్సింగ్ కళాశాల మంజూరు చేయడం హర్షనీయమని నర్సంపేట మాజీ ఎంఎలిని పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడికల్ కళాశాలను అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు,నర్సింగ్ కళాశాల తరగతులను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని కోరారు.మెడికల్ కళాశాల,నర్సింగ్ కళాశాల,నర్సింగ్ కళాశాలల పెండింగ్ పనులను పూర్తిచేసి విద్యాసంవత్సరం తరగతులను ప్రారంభించాలన్నారు.సర్సంపేటట నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో నర్సంపేట నియోకవర్గానికి మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందని, ఈ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఆస్పత్రి నూతన భవనాలు నిర్మాణ పనులు వేగంగా జరగడంతో మెడికల్ కళాశాల ఏర్పాటు సులభతరమైందని పేర్కొన్నారు. వైద్య రంగంలో నర్సంపేటను రాష్ట్ర,జాతీయ స్థాయిలో నిలపడం జరిగిందని అలాగే రూ.188 కోట్ల నిధులతో పూర్తిస్థాయి అనుమతి మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికి కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయని, గత పదినెలలుగా పనులు వేగవంతంగా జరగడం లేదని అర్పించారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వం 100 సీట్ల అనుమతితో మెడికల్ కళాశాలను మంజూరు చేయగా నేడు 50సీట్లు కుదించడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. మెడికల్, నర్సింగ్ కళాశాల కోసం భవన నిర్మాణాలను వేగవంతం చేసి విద్యార్థులకు బందుబాటులోకి తీసుకురావాలన్నారు. మెడికల్
కళాశాల మౌళిక వసతులను,బోధన, బోధనేతర సిబ్బంది నియామకం పారదర్శకంగా త్వరగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు.