భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ (బిట్స్) పాఠశాలలో శనివారం వనమహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. రాజేష్ కుమార్ చౌదరి పాఠశాలలోని ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎన్.రాజేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ మొక్కల వలన మానవులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, నేటి మొక్కలు కాబోయే రోజుల్లో అతి పెద్ద వృక్షాలుగా తయారై మానవులకు నీడతో పాటు, ఆక్సిజన్ పిచ్చి కాపాడతాయన్నారు. అదేవిధంగా మొక్కల వలన వర్షాలు అతిగా కురిసి, పంటలు పనుతాయన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో చెట్లను పెంచుకొని పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలన్నారు. యావత్ ప్రపంచం వృక్షాలపై ఆధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి మన భూమాతను పర్యావరణం నుండి కాపాడాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, డ్రైవర్ల బృందం, తదితరులు పాల్గొన్నారు.