జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు పెండ్యాల
#నెక్కొండ ,నేటి ధాత్రి: మండల కేంద్రంలో టైలర్స్ డే సందర్భంగా మేరు సంఘం మండల ప్రధాన కార్యదర్శి కొత్త కొండ గణేష్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేరు సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ హాజరై జెండా ఆవిష్కరించారు అనంతరం పెండ్యాల హరిప్రసాద్ మాట్లాడుతూ వివిధ రూపాలలో ట్రైలర్లు దుస్తులను కుట్టి మానవునికి అందాన్ని తీసుకువచ్చే గొప్ప ఆర్టిస్ట్ మీరు కులస్తుడని కుట్టు మిషన్ సృష్టికర్త ఏలియస్ ఏవే అని అతని జన్మదినాన్ని టైలర్స్ డే గా జరుపుకుంటున్నామని అన్నారు. అనంతరం ఎలియాస్ హొవే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, పెండ్యాల శ్రీనివాస్, కీర్తి సురేష్, రామగిరి సతీష్, లక్ష్మయ్య, కీర్తి రామ్మోహన్, రాజేష్, చందర్, సరళ, తదితరులు పాల్గొన్నారు.