ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.వివిధ ప్రజా సంఘాల నాయకులు,వివిధ పార్టీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దారావత్ సుభాష్ నాయక్ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సాయుధ పోరాటంతో శత్రు సైన్యాని ఎదురుకున్న భరత ముద్దు బిడ్డా ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు.
