
మంచిర్యాల/ప్రతినిధి నేటిదాత్రి:
మంచిర్యాల పట్టణంలో
స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) 67 వ ఆవిర్భావ దినోత్సవాన్ని
మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కారుకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా
జిల్లా అధ్యక్షులు కారుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ. నిరుపేదల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్. పి.ఐ)
అని పార్టీ ద్వారా అనేక ఉద్యమాలు నిరుపేదల కోసం చేస్తున్నామని తెలిపారు మంచిర్యాల పట్టణంలో కార్మికుల దోపిడీ జరుగుతుందని
ఇక్కడ కార్మిక శాఖ అధికారులు అవినీతి నిద్రమత్తులో ఉన్నారని అన్నారు
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ)
ప్రజా. కార్మిక సమస్యలపై ఉద్యమం చేస్తుందని అతి తక్కువ రేటుతో కార్మికులతో పని చేయించుకుంటు బడా వ్యాపారులు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ)
కార్మిక. ప్రజా సమస్యలపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ)
పార్టీ మహిళ విభాగం
జిల్లా అధ్యక్షురాలు జగదాంబల లలిత. జిల్లా ఉపాధ్యక్షురాలు మొగురం మిరియా. సీనియర్ దళిత రాష్ట్ర నాయకురాలు సుశీల. పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు