మంగపేట నేటి ధాత్రి
శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా సరిహద్దు గ్రామమైన అకినేపల్లి మల్లారం గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వందలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అకినేపల్లి మల్లారం టీ కొత్తగూడెం జంట గ్రామాల ప్రజలు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు