రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
కేంద్ర మాజీ మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను క్యాతనపల్లి మునిసిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ ,కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ స్వామి, కౌన్సిలర్ పొలం సత్యం,కో ఆప్షన్ సభ్యులు యాకుబ్ ఆలీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.