ఘనంగా డ్రైవర్ల దినోత్సవం.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో
డ్రైవర్ల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రసున్నలక్ష్మి,సీఐ రాజశేకర్,ఎడిసి సాంబయ్యలకు నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ సంఘం అధ్యక్షుడు డ్రైవర్ కందికొండ మోహన్ తో పాటు పలువురు
డ్రైవర్లు వేరువేరుగా పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డ్రైవర్లు రవిందర్, శశిదర్, రాజాలు, రాజు, మహేందర్,పొన్నం శ్రీను,కొలిశేట్టి రంగయ్య, చిన్న రాజాలు ,పి శ్రీనివాస్, బిడి రాజు తదితరులు పాల్గొన్నారు.
