
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేటమండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు సోమవారం చత్రపతి శివాజీ 394 వ జయంతి వేడుకలను ఆరే సంక్షేమ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం మండల అధ్యక్షులు దుర్నాల రాజు,అధ్యక్షులు పాపారావు శివాజీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ భారతదేశంలో స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని చత్రపతి శివాజీ నెలకు కొలపడమే కాక మొగలు సామ్రాజ్యాన్ని ఎదిరించిన దిశాలి అని కొనియాడారు. చత్రపతి శివాజీ పట్టాభిషేకం వార్షికోత్సవాన్ని జరిగిన సందర్భాన్ని హిందూ సామ్రాజ్య దివాస్ గా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మోకిడే మహేందర్ మండల నాయకులు రవీందర్ రాజేందర్ రాజేశ్వరరావు రాజు శంకర్ సచిన్ శివ నాగేష్ కొమురయ్య పాల్గొన్నారు.