వరంగల్ /గీసుకొండ నేటిధాత్రి :
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన సందర్భంగా గీసుగొండ మండల దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోట ప్రమోద్ ఆధ్వర్యంలో గీసుగొండ మండలంలోని కోనయమాకుల గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.
దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోట ప్రమోద్ మాట్లాడుతూ
రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అని అన్నారు.ఆయన తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కెసిఆర్ ప్రభుత్వంలో పనిచేశాడని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి కోసం రాజకీయ నాయకుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని ప్రమోద్ వివరించారు.ఈ కార్యక్రమంలో గీసుగొండ మండల బి.ఆర్.ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సిరీసే శ్రీకాంత్, గీసుగొండ గ్రామ పార్టీ అధ్యక్షుడు పసుల రాజేందర్, బి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు లాడే సంతోష్, కందరి గోపాల్ , జహీర్,సారంగం, మార్గం రాజు,రంగారావు యూత్ నాయకులు రాజీవ్ గాంధీ,రాంబాబు,శ్రీకాంత్,ప్రశాంత్ తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.