
లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిదాత్రి:
శనివారం పట్టణంలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకురాళ్లు బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ నృత్యాలతో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పువ్వులను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ చరిత్రలో అద్భుతమైన పండుగని, ఈ పండుగను కళాశాలలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రమేష్ చంద్ర జైన్,అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.