
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం చిన్న రాజేందర్.
మహా ముత్తారం నేటి ధాత్రి.
కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జాయింట్ ఫ్లాట్ ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఉద్యోగ సంఘాలు అఖిల భారత ఫెడరేషన్లు సంయుక్త కిషన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల కేంద్రంలో ప్రజా సంఘాలు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆదివాసీ గిరిజన సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో మహా ముత్తారం మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీసు నుండి స్తూపం వరకు ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీలో అంగన్వాడీలు ఆశలు మధ్యాహ్న భోజన కార్మికులు కార్మికులు కర్షకులు ప్రజలు పాల్గొన్నారు వ్యాపారులు సహకరించారు
గ్రామీణ బంద్ ర్యాలీని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం చిన రాజేందర్ మాట్లాడుతూ
బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా కార్మిక వ్యవసాయ కూలీల సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని విస్మరించింది ఉద్యోగ కల్పన పడిపోయింది ప్రతి భారతీయుడు అకౌంట్లో 15 లక్షల డిపాజిట్ చేస్తామన్న మాటను మర్చిపోయారు.
అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చారు కనీస వేతనం నెలకు 26వేల రూపాయలు నిర్ణయించేందుకు అంగీకరించడం లేదు సమ్మే హక్కును కాలరాస్తున్నారు. పీఎఫ్ ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నారు
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తగ్గిస్తున్నారు ప్రతి వ్యక్తికి ₹200 రోజుల పని 600 రూపాయల రోజు వారి వేతనం ఇవ్వాలన్న డిమాండ్ ను పట్టించుకోవడం లేదు.
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం లేదు.
కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరింప చేయాలి ఆదివాసీల హక్కులచట్టం కఠినంగా అమలు చేయాలి జాతీయ విద్యా విధానం 2002ను రద్దు చేయాలి.
దళిత గిరిజనులు ఆదివాసీలపై దాడులను ఆపాలి సామాజిక న్యాయాన్ని కాపాడాలి.జర్నలిస్టులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. ఈ విధంగా మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ జయప్రద అంగన్వాడీల మండల అధ్యక్షురాలు బెల్లంకొండ భీమక్క సెక్టర్ అధ్యక్షురాలు ఆర్ భద్రమ్మ సిహెచ్ లత ప్రాజెక్టు లీడర్ పి నిర్మల చీర్ల మల్లేశ్వరి అజంతా సుగుణ అంగన్వాడి ఆయాలు మంచినీళ్ల సరోజన తైనేని లక్ష్మి ఎం సారక్క ఆశ వర్కర్ల మండల అధ్యక్షురాలు దుర్గం సరిత రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ మల్లయ్య అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు కర్షకులు ప్రజలు పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయడం జరిగింది.