గ్రామాల యువకులే దేశానికి పట్టుకొమ్మలు
గ్రామాల్లో ప్రజలు స్నేహపూర్వకంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని డిసిపి నాగరాజు అన్నారు. గురువారం సాయంత్రం నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో నర్సంపేట ఏసీపీ సునీతమోహన్ ఆధ్వర్యంలో కార్టన్‌సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిలో తనిఖీలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక ఆధార్‌కార్డులు పరిశీలన, గ్రామాల్లోని ద్విచక్రవాహనాలకు లైసెన్సులు, ఇన్సూరెన్సుతోపాటు వివిధ రకాల ధ్రువపత్రాలు లేని ద్విచక్రవాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా డిసిపి నాగరాజు మాట్లాడుతూ గ్రామాలల్లో రైతులు విత్తనాలు తీసుకొనేటప్పుడు కల్తీ విత్తనాలకు మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఏసీపీ సునీతామోహన్ మాట్లాడుతూ వేసవికాలంలో ఆరుబయట నిద్రపోకూడదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రతా సూచనలు పాటించాలని, చిన్న వయస్సులోనే మద్యానికి బానిసై అధిక వేగంతో ద్విచక్రవాహనాలు నడుపుతున్నారని యువతను ఉద్దేశించి మాట్లాడారు. నర్సంపేట టౌన్ సీఐ దేవేందర్‌రెడ్డి, నెక్కొండ సిఐ పెద్దన్నకుమార్, నర్సంపేట ఎస్సై నాగ్‌నాథ్, దుగ్గొండి ఎస్సై సాంబమూర్తి, చెన్నారావుపేట ఎస్సై జగదీష్, ఏఎసైలు, కానిస్టేబుల్స్, సిటీ గార్డ్ పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.