Gram Sabha on EGS Works in Rekumpalli
రేకంపల్లిలో ఈజీఎస్ పనులపట్ల గ్రామసభ
దుగ్గొండి,నేటిధాత్రి:
దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామ పంచాయతీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనుల ప్రణాళిక ప్రక్రియల కోసం పంచాయతీ కార్యదర్శి అశోక్ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు.గ్రామంలో గుర్తించిన పనులను చదివి వినిపించారు.ఏపీఓ దయ్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో నీటి నిలువను పెంచడానికి ఫారంపౌండ్స్, చిన్న నీటి కుంటల నిర్మాణం చేయుటకు అవకాశం ఉందన్నారు.రైతుల భూములలో లేక కమ్యూనిటీ ల్యాండ్లలో నిర్మించుకోవచ్చని తెలిపారు.అదేవిధంగా వ్యక్తిగత పనుల కింద పండ్ల తోటల పెంపకం, పశువుల పాకల నిర్మాణం, కోళ్ల పాకల నిర్మాణం మొదలగు పనులు చేయుటకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ గ్రామసభలో టెక్నికల్ అసిస్టెంట్ ఇల్లందుల సమ్మయ్య,ఫీల్డ్ అసిస్టెంట్లు స్వర్ణ,రాణి గ్రామస్తులు పాల్గొన్నారు.
