చిట్యాల, నేటి దాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని1వ కేంద్రంలో సంధ్యారాణి అంగన్వాడీ టీచర్ ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం కు ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో డిప్యూటీ ఎమ్మార్వో హాజరైనారు ఈ కార్యక్రమం ఉద్దేశించి సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ మూడు సంవత్సరముల నుండి ఆరు సంవత్సరాల పిల్లలందరూ జూన్ 2023 నుండి ఏప్రిల్ 24 వరకు పది నెలల కాలంలో పిల్లలు ఆరు అంశాల ద్వారా నేర్చుకున్న కార్యక్రమాలపై పిల్లలకు స్టార్ గుర్తులు ఇస్తూ తల్లులందరికీ పిల్లలు ఎందులో మూడు స్టార్ గుర్తులు వస్తే అన్ని రంగాలలో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నట్లు రెండు స్టార్ గుర్తులు వస్తే కొంత వరకు ఇంకా టీచర్ ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఒక్క స్టార్ గుర్తు వస్తే పిల్ల లు అనారోగ్యపరంగా వెనుకడుగులో ఉన్నారని తల్లిదండ్రులు అన్ని విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపించాలని సూచించినారు ముఖ్యంగా మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లల వరకు ప్రైవేట్ స్కూల్లో వేయకుండా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసినట్లయితే పిల్లలు ఆరోగ్యపరంగా ఎదుగుతూ అన్ని రంగాలలో నేటి బాలలే రేపటి పౌరులుగా మంచి క్రమశిక్షణతో ఉంటారని అందుకు ఈ సంవత్సరము కలెక్టర్ గారు సొంత భవనాలు కలిగిన కేంద్రాలకు చాలా ఆట వస్తువులు టీవీ ఇవ్వడం కల్తీ లేని ఆకుకూరలు కూరగాయలు పండించాలని పొషనవాటిక ఏర్పాటుచేసి అందులో పండిన ఆకుకూరలను కూరగాయలను వంటలో ఉపయోగించుతు పిల్లలలో వైసులవారిగా ఎదగాలిసిన బరువు ఎత్తు లో మార్పులు తీసుకు రావడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పిల్లల అభివృద్ధి పరిశీలన పత్రాలను ఎమ్మార్వో గారి చేతుల మీదుగా తల్లులకు ఇప్పించడం అయినది ఈ కార్యక్రమంలో సంధ్యారాణి సుజాత తల్లులు హాజరైనారు.