Gauda Community Felicitates Elected Local Body Representatives
పాలక వర్గానికి గౌడ కులస్తులు సన్మానం
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ రేణుక దేవత ఎల్లమ్మ సిద్దోగం సందర్బంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు స్థానిక గౌడ కుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ… గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్ధొగం మంగళవారం జరిగుతుందని ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో గ్రామస్తులు, ప్రజలు, మహిళలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాందాల శారద అబ్రహం,ఉప సర్పంచ్ అనపర్తి నరేష్ కుమార్, వార్డ్ సభ్యులు అర్షం లావణ్య, అర్షం అనూష, పాటి రేణుక,ఈసరి శిల్ప, లింగాల శ్రీనివాస్,తూం గణేష్,పాటి సుధాకర్,గుంటపెల్లి నారాయణ,పిట్ల మనోహర్, గ్రామ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మందాల అబ్రహం, గౌడ కులస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
