
Manda Krishna’s
మోసం చేసిన సర్కారు.. తాడోపేడో తెల్చుకుందాం: మందకృష్ణ మాదిగ,
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: రాష్ట్రంలోని 50 లక్షల పెన్షనర్లకు 20 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అధికారం చేపట్టి 20 నెలలవుతున్న ఇచ్చిన హామీ అమలు చేయకుండా పెన్షనర్లను మోసం చేస్తున్న ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని ఆయన హెచ్చరించారు. సెప్టెంబర్ 9న హైదరాబాదులో నిర్వహించ పెన్షనర్ల బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన పెన్షనర్ల బహిరంగ నియోజకవర్గ సన్నాహక సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.20 నెలల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం పెంపు తదితర సంక్షేమ పథకాల కోసం తాను చేసిన పోరాటం, దాని నేపథ్యాలను పేపర్, ఆడియో క్లిప్పింగ్స్ లతో సభకు వివరించి తన పోరాటపటీమను వివరించారు. విపక్షాల అసమర్థత, అధికార కరపక్షం నిర్లక్ష్యంతో పేదల సమస్యలు గుర్తు రావని, హామీలను పట్టించుకోరని మండిపడ్డారు. తను ఎప్పుడూ.. అణగారిన వర్గాల పక్షంలోనే పోరాడుతానన్నారు. ఇక్కడ అన్ని వర్గాల వారికి సేవ చేసే అవకాశం తనకు కలుగుతుందన్నారు. ఎమ్మార్పీఎస్ అందరికీ భరోసానిచ్చే బ్రాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకే బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తున్నామన్నారు.వికలాంగులకు రూ.6000తో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఇతర పెన్షన్లన్ని డబుల్ చేసేంతవరకు పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వికలాంగులు, పెన్షనర్లందరూ భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీ నేతలు, పనులు, పెన్షనర్లు మందకృష్ణ మాదిగను మాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ఎమ్మార్పీఎస్, పెన్షనర్లు సంఘం నేతలు అబ్రహం మాదిగ ఉల్లాస్ మాదిగ జయరాజ్, నర్సింలు, రామరవి కిరణ్, జ్యోతి, నారాయణ, విశ్వనాథ్ యాదవ్, జైరాజ్ మాదిగ, మైకల్ మాదిగ, రవికుమార్, నిర్మల్ మాదిగ, రాజు, మనోజ్, నగేష్, యేసప్ప, రాజేందర్, సింగితం రాజు, తదితరులు పాల్గొన్నారు.