
మంత్రులు శ్రీదర్ బాబు, కొండా సురేఖ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్*!!
జగిత్యాల నేటి ధాత్రి
ధర్మపురి నియోజక వర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆద్వర్యంలో శ్రీ ప్రేమికవరద వేద పరిపాలన సభ హైదరాబాద్ గారి నేతృత్వంలో ఈ నెల 18 నుండి 24 వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలో 21 మంది వేదపండితులచే నిర్వహిస్తున్న వేద పారాయణాలు,వేదహవన కార్యక్రమంలో చివరి రోజైన మహాపూర్ణహుతి కార్యక్రమంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు , మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి .ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మన్ కుమార్* పాల్గొన్నారు.అనంతరం లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు,మాట్లాడుతూ.మంత్రివర్యులు శ్రీధర్ బాబు మరియు మంత్రివర్యులు కొండ సురేఖ మాట్లాడుతూ.లక్ష్మణ్ కుమార్ ఆద్వర్యంలో గత 7 రోజులుగా నిర్వహిస్తున్న వేద పారాయణం మరియు హవనం కార్యక్రమంలో తమను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,ధర్మపురికి సంబందించిన పలు సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని,వాటనంటిని త్వరలోనే పరిష్కరిస్తామని, ధర్మపురినీ టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు,లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.ధర్మపురిలో వేద పారాయణం నిర్వహించాలని సంకల్పించినప్పుడు నేను మంత్రివర్యులు శ్రీధర్ బాబు మరియు మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని,వారు కూడ నిర్వహించాలని దానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వారు చెప్పడం జరిగిందని,గత 7 రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో వేద పారాయణం హవనం నిర్వహించడం జరిగిందనీ,ధర్మపురి ప్రజలు ఏళ్ల వేళల ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నానని,ఇంత పవిత్రమైన హోమ కార్యక్రమం నా ఆద్వర్యంలో నిర్వహించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామని,ధర్మపురినీ టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని,నైట్ కాలేజ్ లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని,ధర్మపురి ప్రజలకు శాశ్వత త్రాగు నీరు అందించే విషయంలో వాటర్ గ్రిడ్ నీ ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ని,మంత్రి కొండ సురేఖ ని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గ మండల అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు,అధికారులు,గ్రామస్థులు పాల్గొన్నారు.