
మహాదేవపూర్- నేటి ధాత్రి:
ప్రభుత్వాలు అన్ని నిరుద్యోగులకు మోసం చేసి కోట్లు దండుకొని పదవులు అనుభవిస్తున్నారని తక్షణమే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లను జారీ చేయాలని బి జె వై ఎం డిమాండ్ చేసింది. మంగళవారం రోజు భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘమైన బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలను గత బిఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బూసపూరిత హామీలు ఇచ్చి అధికారం సొంతం చేసుకున్నాక మాయ మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగుల కు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తూ స్థానిక తహసిల్దార్ ప్రహల్లాద్ ఠాకూర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మనోజ్, బల్ల సంపత్ ,శ్యామ్ ,ప్రశాంత్ వెంకటేష్, పూర్ణ చందర్ రాజేందర్ లు ఉన్నారు.