
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మండప హనుమాన్ దేవాలయం ఆవరణలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు..
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..
ఆ రాముల వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకొన్నారు..
వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ బింగి మహేష్, వంగల దివ్య శ్రీనివాస్ నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, కనికరపు రాకేష్, పుల్కం రాజు పులి రాంబాబు గౌడ్, కొత్త అనిల్, తాటికొండ పవన్, ముప్పిడి శ్రీధర్, ఎర్ర శ్రీనివాస్ పాత సత్యలక్ష్మి సిరిగిరి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.