నూతన గ్రామపంచాయతీ భవనం ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

గొల్లపల్లి (జగిత్యాల) నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం శ్రీరాముల పల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ను గురువారం రోజున *ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం అంగన్వాడిల ఆద్వర్యంలో నిర్వహించిన అన్నప్రాసన,అక్షరాభ్యాసం. శ్రీమంతం .కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సావ కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఆరోగ్య శ్రీ పరిధి పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందని,గొల్లపెల్లి మండలం శ్రీ రాములపల్లి గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని,
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిశాంత్ రెడ్డి, జెడ్ పి టి సి గొస్కుల జలంధర్,సర్పంచ్ నేరెళ్ల గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఏలేటి అసిరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కంపేల్లి హనుమన్లు, ఎంపీటీసీ లంబ దనవ్వ లక్ష్మణ్.సీనియర్ నాయకులు సురేందర్, నేరెళ్ళ మహేష్, మరియు వార్డు సభ్యులు కో ఆప్షన్ మెంబర్లు మండల ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!