*మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
*మహిళా సంఘ భవనం మంజూరుకు హామీ
మేడిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా
మేడిపల్లి మండల కేంద్రంలో గురువారం కృతజ్ఞత ర్యాలీలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.. మేడిపల్లి మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన మేడిపల్లి మండలప్రజలతో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ఇంతటి గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మీకు రుణపడి ఉంటాను అన్నారు..మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే ప్రభుత్వ పెద్దలు తనకు ప్రభుత్వ విప్ గా మరో మెట్టేక్కించారని అన్నారు..ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదట గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని తెలిపారు.రాజీవ్ ఆరోగ్య శ్రీపథకం కింద 10 లక్షల వరకు అమలు చేశామన్నారు.. నా గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
*ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, బీమారం మండలం అధ్యక్షులు&రాష్ట్ర గల్ఫ్ ఎన్ ఆర్ ఐ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి,మండల అధికార ప్రతినిధి చేపూరి నాగరాజు, ఉపాధ్యక్షులు మార్గం నర్సారెడ్డి,Sc సేల్ అధ్యక్షులు మ్యాదరి లాజర్, సీనియర్ నాయకులు దాసరి శంకర్, ఉరుమడ్ల నర్సయ్య, గ్రామ అధ్యక్షులు సురేందర్ రెడ్డి,బలగం రాజేష్ బండారి రమేష్ మార్గం నవీన్ మతీన్ చందు భూమేశ్ అర్చన స్వామి గౌడ్ రాజు మహేష్, మేడిపల్లి సోషల్ మీడియా ఇంచార్జి &మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని గంగారెడ్డి, మేడిపల్లి, బీమారం, కథలాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.