
Demand for Funds to Organize Bathukamma and Dasara
బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి
పంచాయితీ కార్యదర్శులు అనేక ఇబ్బందులు పడుతున్నారు
ఇప్పటికైనా గత బకాయిలు విడుదల చేసి వారిని ఆదుకోవాలి
లేని పక్షంలో జిల్లాలోని మినరల్ ఫండ్ డి ఎం ఎఫ్ టి / సిఎస్ఆర్ నిధుల నుండి
బతుకమ్మ ఏర్పాట్లకు నిధులు ఇవ్వాలి
గండ్ర యువసేన జిల్లా అధ్యక్షులు, పి ఎ సి ఎస్ మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం తెలంగాణలో ఆడబిడ్డలు అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ, మరియు దసరా పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, గ్రామాల్లో పరిశుద్ధ పనులు, ఇతర పనులు చేయించలేక కార్యదర్శులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గత బకాయిలు చెల్లించి కార్యదర్శులను ఆదుకోవాలని గండ్ర యువసేన జిల్లా అధ్యక్షులు, గణపురం సొసైటీ మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తూ పంచాయతీ కార్యదర్శుల పట్ల అనవసర భారం వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని, పని భారంతో అప్పుల బాధతో కొందరు కార్యదర్శులు చనిపోతున్నారని ఇప్పటికైనా వస్తున్న బతుకమ్మ దసరా పండుగ లను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామ పంచాయతీకి పదివేల నుండి లక్ష రూపాయల వరకు ఏర్పాట్ల కోసం నిధులు విడుదల చేయాలని, ఇప్పటివరకు కార్యదర్శులు ఖర్చుపెట్టిన మొత్తం డబ్బులను అందించాలని కార్యదర్శుల పట్ల ప్రభుత్వం మానవత దృక్పథం తో వ్యవహారించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, జిల్లా కలెక్టర్ మంచి మనస్సుతో స్పందించి మన జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలకు జిల్లా మినరల్ ఫండ్ డి ఎం ఎఫ్ టి/ సి ఎస్ ఆర్ నిధుల నుండి డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు
పండుగ వేళ కార్యదర్శులు అప్పుల పాలు కాకుండా చూడాలని అన్నారుఅలాగే గ్రామాల్లో గ్రామ పంచాయితీ సిబ్బందికి కూడా పండగ పూట ప్రభుత్వం అండగా ఉండాలని పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు