సభ్యులకు తెలియకుండా రెండు సంవత్సరాలకు లీజుకు తీసుకున్న కాంట్రాక్టర్లు
గుట్టు చాటుగా చేప పిల్లలను పోశారు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులను నూతనంగా ఎన్నుకోబడిన
పాలకవర్గం సంఘం సంఘ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోకుండా కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి బాడీ సమావేశం నిర్వహించారు అందులో కాంట్రాక్టు విధానం ద్వారా చేపలు రొయ్యలు పోసేటట్టు చేశారు చేపలకు రూ 54 రొయ్యలకు రూ 160 కేజీ చొప్పున ధర నిర్ణయించి చెరువును దళారి వాళ్లకు చేస్తూ మా జీవనోపాధిని భంగం కలిగించాలని చూస్తున్నారు దీనికి గణపురం గ్రామ సభ్యులందరూ కలిసి వ్యతిరేకించాము మాకు తెలియకుండా కొందరి సభ్యుల తోటి రాత్రికి రాత్రి దొంగ సంతకాలు చేయించుకుని రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకున్నారు చెరువులో చేపలను పట్టడం బంద్ అని చెప్పి చెరువులో ఉన్న మా యొక్క వలలు 60 వేల రూపాయల విలువ గల వలలను తీసుకొని పోయారు ఈ చెరువు పైన బ్రతికే చుట్టుపక్కల గ్రామాలు గణపురం బుద్ధారం తిమ్మాపూర్ బురకాయల గూడెం గాంధీనగర్ మైలారం దుబ్బుల్లపల్లి ఉన్నాయి పోయిన రెండు సంవత్సరాలు రకం డబ్బులు వసూలు చేశారు సభ్యులందరం కట్టినారు కానీ ఆ డబ్బులు మత్స్యశాఖ ఆఫీసులో చెల్లించకుండా వారి సంత ఖర్చులకు ఉపయోగించుకున్నారు దాని కారణంగా మాకు ఇప్పుడు ప్రభుత్వ ఉచిత చేప పిల్లలు రొయ్యల ను రాకుండా చేస్తున్నారు ఇప్పుడు ఉన్న కరువు పరిస్థితిలో చెరువులు బంద్ పెట్టేస్తున్నారు కార్యవర్గ సభ్యులు కడుపు కొడుతున్నారు ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుచేసి చెరువులో దిగి చేపలు పట్టుకునే విధంగా చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ను కలవగా కార్యవర్గ సభ్యులకు నోటీసులు పంపించిన అయినా చెరువులో కాంట్రాక్టర్లతో కలిసి చేప పిల్లలను పోయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాకేష్ శ్రీనివాస్ శివ శంకర్ లక్షలు సదయ్య రమేష్ మొగిలి భాస్కర్ లింగయ్య సమ్మయ్య రవీందర్ పాల్గొన్నారు