
Gold and Silver Prices
శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!
దేశంలో శ్రావణ మాసంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే వీటి ధరలు గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వీటి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
దేశంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి శుభవార్త వచ్చేసింది. పసిడి ధరలు నిన్నటి రేట్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు (Gold and Silver Prices July 30th 2025) మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూలై 30, 2025న ఉదయం 6:10 గంటల సమయానికి, గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.1,15,900 వద్ద స్థిరంగా ఉంది.
- ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,960, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,640, కిలో వెండి ధర రూ.1,15,900.
- ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,15,900.
- చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900.
- బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,15,900.
- కేరళ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900.
- హైదరాబాద్, విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900.
- విశాఖపట్నం: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,490, కిలో వెండి ధర రూ.1,25,900.
- ఈ ధరలు బులియన్ మార్కెట్ ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వినియోగదారులు వీటిని కొనుగోలు చేసే ముందు మళ్లీ వీటి ధరల గురించి తెలుసుకుని నిర్ణయించుకోవడం ఉత్తమం.
బంగారం ధరలు తగ్గడానికి కారణాలు
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జులై 30, 2025న బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక విధానాలు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపించాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, బంగారం సురక్షిత పెట్టుబడిగా మరింత ఆకర్షణీయంగా మారింది. కానీ ప్రస్తుతం స్థిరమైన ఆర్థిక విధానాలు ధరల తగ్గుదలకు దోహదపడ్డాయి.