
చూడముచ్చటగా యూనిటీ అటోపియా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసిన పాఠశాల.
చిన్నారుల కల ప్రదర్శన ఆకాశంలోని నక్షత్రాల అందాలను తలపించాయి.
విద్యార్థుల ప్రతిభకు తల్లిదండ్రుల ఆనందాలు ఆకాశానికి అంటుకున్నాయి.
భూమిపై పాదాలు సరిగ్గా వేయరాని చిన్నారుల చిందులను చూసి ఉపాధ్యాయులకు సెల్యూట్ అన్నారు, గ్రామస్తులు తల్లిదండ్రులు.
ఆదర్శవంతమైన ప్రదేశం విద్యార్థుల దూరదృష్టి సంస్కరణను పెంపొందించడమే గుడ్ మార్నింగ్ లక్ష్యం, కరస్పాండెంట్ శశి.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
ఐక్యత ఆదర్శ దామం తో ఒక దూర దృష్టి ఆలోచన ఒక పాఠశాల విద్యార్థుల కు విద్యతోపాటు సాహిత్య కళా నృత్యం వారి నైపుణ్యతను విద్య తోపాటు విద్యార్థుల మధ్య ఐక్యత భావాన్ని చాటి చెప్పే విధంగా పాఠశాల విద్య కాకుండా విద్యార్థులకు ఐక్యత భావంతో దూర దృష్టి ఆలోచన భవిష్యత్తు తరాన్ని దృష్టిలో ఉంచుకొని “యూనిటీ ఆఫ్ అటోపియా” ఐక్యత ఆదర్శ దామం సాంస్కృతిక కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల కేంద్రంలోని గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్ శనివారం రాత్రి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
విద్యార్థుల్లో ఐక్యత ఆదర్శదామం లక్ష్యంతో గుడ్ మార్నింగ్ పాఠశాల.
పాఠశాలల్లో విద్యార్థులు విద్యతో పాటు సామాజిక బాధ్యత ఆదర్శ గ్రామమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుందన్న విషయం మాటల వరకే పరిమితైన సందర్భాలు మన ముందు ఉన్నప్పటికీ, ఒక పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా మారుమూల ప్రాంతంలో ఆంగ్ల భాష పై పట్టు తో అనేక విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఘనత తన ఖాతాలో వేసుకున్నప్పటికీ గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్ విద్య బోధన తోపాటు ఐక్యత ఆదర్శ దామం తో విద్యార్థులను విద్యతోపాటు ప్రతిభను కూడా వెలికి తీయడంలో పాఠశాలకు తనదైన ముద్ర ఉందన్నట్టు ఓసారి రుజువు చేసుకోండి గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్. పాఠశాలలోని నర్సరీ నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు దాగి ఉన్న నైపుణ్యానికి అటోపియా అనే ఒక తలాత్మక వాక్యానికి రూపు దిద్దిన ఘనత కూడా ఈ పాఠశాలకు దక్కిందని అంటున్నారు ప్రజలు. విద్యార్థులు సమాజంలో ఐక్యత ఆదర్శ దామాన్ని భవిష్యత్తులో కూడా పాఠశాల కార్యక్రమాలను గుర్తుంచుకునే విధంగా ప్రజా వ్యవస్థలు విద్యార్థులు ముందుండే విధంగా వారిలోని కళాత్మక సృజనాలను యూనిటీ ఆఫ్ అటోపియా కార్యక్రమంతో పాఠశాల తిర పైకి తీసుకు రావడం హర్షనీయం.
చూడముచ్చటగా యూనిటీ అటోపియా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసిన పాఠశాల.
గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్ పాఠశాల విద్యార్థులతో ఐక్యత ఆదర్శ దానం యూనిటీ ఆఫ్ అటోపియా సాంస్కృతిక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రజల ముందుకు తీసుకువచ్చింది. అటోపియా సాంస్కృతిక కార్యక్రమంతో వాస్తవంగా విద్యార్థుల్లో ఉన్న వారి నైపుణ్యాన్ని సినిమా నాటకం గానం తో పాటు కుల మతాలకు సంబంధించిన కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించడం తోపాటు సమాజంలో విద్యార్థులు రాబోయే రోజుల్లో వారి నడవడికి సంబంధించిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడే వ్యవహారాలను అనేక విద్యార్థులు వివిధ పద్ధతుల్లో వారికి కేటాయించిన కార్యక్రమాలను ప్రదర్శించడం వాస్తవానికి విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను ఇటు తల్లిదండ్రులు అటు గ్రామ ప్రజలు తమ పిల్లల్లో ఇంత నైపుణ్యత ఉందా అని ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠశాల విద్యా బోధనలు దించడమే కాకుండా విద్యార్థుల నైపుణ్యం తో పాటు సమాజంలో ప్రేమ ఆప్యాయత తో ముందుకు సాగేలా పాఠశాల విద్య నుండి విద్యార్థులకు క్రమశిక్షణ ఇవ్వడం రాబోయే రోజుల్లో విద్యార్థులు తమ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యార్థులకు మేలు కోల్పోవడం వారి బాధ్యతలను అలాగే ప్రజల మనోభావాలను గౌరవించే విధానం యూనిటీ ఆఫ్ అటోపియా ఐక్యత ఆదర్శ ధామంతో ప్రదర్శించడం పాఠశాల ప్రజలు మరియు తల్లిదండ్రుల మనసుల్లో శభాష్ అనుకునేలా చేసింది.
చిన్నారుల కల ప్రదర్శన ఆకాశంలోని నక్షత్రాల అందాలను తలపించాయి.
గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్ యూనిటీ ఆఫ్ అటోపియా ఐక్యత ఆదర్శ ధర్మం కార్యక్రమాన్ని ఎంతో చక్కగా విద్యార్థుల ప్రదర్శన ప్రజలు మరియు తల్లిదండ్రులను ఒక వైపు ఆకట్టుకుంటున్న క్రమంలో, మరోవైపు పాఠశాల లో విద్యాభ్యాసం చేసే చిన్నారుల ప్రదర్శనలు ఆకాశంలో వెలసి నక్షత్రాల అందాలుగా తలపించాయి. సినిమా రంగం పాటలైన ఇతర కళా ప్రదర్శనలు అయిన ఆ చిన్నారులు చేసిన నృత్యాలు వారి అలంకరణ ఆకాశంలోని నక్షత్రాల మెరవడం ఒకవైపు ఆనందంతో పాటు గర్వాన్ని కూడా కలిగించింది.
విద్యార్థుల ప్రతిభకు తల్లిదండ్రుల ఆనందాలు ఆకాశానికి అంటుకున్నాయి.
యూనిటీ ఆఫ్ అటోపియా ఐక్యత ఆదర్శ ధర్మం సాంస్కృత కార్యక్రమంలో పాఠశాలకు సంబంధించిన ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల ప్రదర్శనను తిలకించుటకు వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లల నైపుణ్యాన్ని చూసి వారి ఆనందాలు ఆకాశానికి అంటుకున్నాయని చెప్పవచ్చు, ఎందుకంటే పాఠశాలలో విద్యాభ్యాసం పై ఉన్న శ్రద్ధ కంటే రెట్టింపు శ్రద్ధ విద్యార్థులకు వారిలో నైపుణ్యానికి ఈరోజు పాఠశాల శ్రీకారం చుట్టడం సినిమా నాటక తో పాటు ప్రజల్లో తమ ప్రవర్తన సమాజం పట్ల బాధ్యత అలాంటి అంశాలను కళాత్మక సృజనాలను తమ పిల్లలు ప్రదర్శించడం తల్లిదండ్రులకు సైతం తమ పిల్లలలో ఇంత నైపుణ్యత ఉందన్న విషయాన్ని తామే ఇప్పటికీ గుర్తించలేకపోయామని అలాంటిది పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లల కళా నైపుణ్యాన్ని ఈరోజు సమాజం ముందు తీసుకురావడం చూసి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అంతులేకుండా పోయింది.
భూమిపై పాదాలు సరిగ్గా వేయరాని చిన్నారుల చిందులను చూసి ఉపాధ్యాయులకు సెల్యూట్ అన్నారు, గ్రామస్తులు తల్లిదండ్రులు.
గుడ్ మార్నింగ్ గ్రామర్ హైస్కూల్లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి తో పాటు నర్సరీ కిండర్ గార్డెన్ లో ఇప్పుడిప్పుడే ఏ బి సి డి లు నేర్చుకునే ఆ బుల్లి పాదాలు సరిగ్గా భూమిపై కూడా నిలువని ఆ పాదాలకు ఈరోజు సినిమా నాట్యం కథ లాంటి సన్నివేశాలు చేయడం అవి తల్లిదండ్రులకు అంతులేని ఆనందాన్ని కలిగించింది.
నర్సరీ కిండర్ గార్డెన్ విద్యార్థులు చేసినటువంటి భక్తి సినిమా పాటలతో పాటు పలు డ్రామా స్పీచ్ లను చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. కొన్ని విద్యార్థులు అయితే ఆ బుల్లి బుల్లి పాదాలతో సినిమా పాటలకు చిందులు వేయడం చూడముచ్చటగా కార్యక్రమం సాగింది. కనీసం మాటలు సరిగ్గా రాణి ఆ చిన్నారులు చేసినటువంటి కళా ప్రదర్శన గత కొద్ది రోజులుగా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఆ చిన్నారులను కళా ప్రదర్శన కు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంలో ఉపాధ్యాయులు పడిన కష్టాల ఫలితం చిన్నారి నృత్యాలు కళా ప్రదర్శనలో ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు మరియు ప్రజలు మెచ్చుకొని శభాష్ గుడ్ మార్నింగ్ టీచర్స్ అని చెప్పక తప్పలేదు.
ఆదర్శవంతమైన ప్రదేశం విద్యార్థుల దూరదృష్టి సంస్కరణను పెంపొందించడమే గుడ్ మార్నింగ్ లక్ష్యం, కరస్పాండెంట్ శశి.
యూనిటీ ఆఫ్ అటోపియా అనే ఒక ఆలోచనకు గుడ్ మార్నింగ్ పాఠశాల ముందుండి విద్యతోపాటు విద్యార్థుల కళా నైపుణ్యం సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో పాఠశాల ఉంటుందని కరస్పాండెంట్ ఎంఎం శశి అన్నారు. యూనిటీ ఆఫ్ అటోపియా కార్యక్రమాన్ని ఉద్దేశించి శశి మాట్లాడుతూ యూనిటీ ఆఫ్ అటోపియా ఆదర్శ దామం ఐక్యత అనే ఆలోచన ఒక సాహిత్యం నుండి వస్తుందని 18 00 దశంలో ఫెటోస్ రిపబ్లిక్ రచయిత ఆదర్శ దామం సర్వ సాధారణమైందని కొత్త శాస్త్రీయ ఆలోచనల అనుగుణంగా ప్రజల మంచి భవిష్యత్తు గురించి ఆలోచించే కళా ప్రక్రియ యొక్క ప్రజా ఆదరణతో పాటు విరోధులు కూడా స్నేహభావంతో మెలిగే విధంగా చేయడంలో యూనిటీ ఆఫ్ అటోపియా ఉపయోగపడడం జరిగిందని అన్నారు. యూనిటీ ఆఫ్ అటోపియా ద్వారా ఒక తోటలోని పూలు చెట్లు ఎలాగైతే కలిసిమెలిసి ఆనందకరంగా కనబడతాయో ఒక పాఠశాల తమ విద్యార్థులకు పాఠశాలలో విద్యతోపాటు భవిష్యత్తు తరంలో ప్రజలు అలాగే ఆ యొక్క విద్యార్థి కుటుంబాల్లో కూడా ఒక పూల వనం ఇచ్చే అటువంటి అందాలు వాటిలో ఉన్న సంతోషాన్ని విద్యార్థుల జీవితాల్లో తీసుకురావడమే పాఠశాల లక్ష్యమని అన్నారు. యూనిటీ ఆఫ్ అటోపియా విద్యార్థులకు విద్యతోపాటు వారి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వారి దూరదృష్టి సంస్కరణలు సూచిస్తూ విద్యతో పాటు సమాజంలో ఉడుతడుపులను తట్టుకునే శక్తి రాబోయే రోజుల్లో విద్యార్థులు తమ మంచి చెడులను స్వయంగా గుర్తించి భవిష్యత్తులో మంచి దారులను వెతుక్కోవడంలో యూనిటీ ఆఫ్ అటోపియా ఐక్యత ఆదర్శ దామం కార్యక్రమాల ద్వారా వారిలో అనేక మార్పులు రావడం తో పాటు వారి దూరదృష్టి ముందస్తు భవిష్యత్తు నువ్వు కూడా తీర్చిదిద్దుకునే శక్తిని అందిస్తుందని శశి అన్నారు, ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం ఎం అని, కన్నయ్య, తోపాటు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది మండల కేంద్ర ప్రజలతోపాటు ఇతర మండలాలు నుండి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రత్యేక ఆహ్వానితులుగా పాత్రికేయులు పాల్గొనడం జరిగింది. ఒక గొప్ప సందేశాన్ని ప్రజలకు మరియు తల్లిదండ్రులకు వారి పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని పాఠశాల వెలికి తీసి ప్రజల ముందు ఒక గొప్ప విద్యతో కూడిన విలువలను తమ పిల్లలకు అందిస్తున్నందుకు పాఠశాల యజమాన్యానికి తల్లిదండ్రులు గ్రామ ప్రజలు ప్రత్యేక ఆహ్వానితులు అభినందించడం జరిగింది.