పుట్టిన ఊరుకు సేవ చేయడం అదృష్టం -ఎన్ఆర్ఐ గడ్డం ఎల్లారెడ్డి

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం బండపల్లి
గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని ప్రముఖ ఎన్ ఆర్ఐ గడ్డం ఎల్లారెడ్డి అన్నారు
బండపల్లి గ్రామంలో గడ్డం ఎల్లారెడ్డి తన తల్లిదండ్రులు చిన్న రాఘవరెడ్డి – లలితవ్వ స్మారకర్థం ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం, పాఠశా లో ఆట స్థలం కోసం 5 ఎకరాల స్థలం కొనుగోలు, ప్రభుత్వ ఉప ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ఆర్థిక సహయం చేయగా, గ్రామానికి వచ్చిన ఎల్లారెడ్డిని గ్రామ సర్పంచ్ న్యాత విజయ జార్జ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా ఎల్లారెడ్డిని గ్రామంలో డప్పు చప్పులతో ఊరేగించారు, అనంతరం ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమంలో ఎల్లారెడ్డిని శాలువలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ… తనకు జన్మనిచ్చి చదువునిచ్చిన ఉన్న ఊరును ఎప్పటికీ మర్చిపోనున్నారు, గ్రామ అభివృద్ధికి ఎప్పటికీ కృషి చేస్తానన్నారు. పాఠశాలలో విద్యార్థులకు బెంచీలు, టీవీని అందజేస్తామన్నారు. ప్రతి సంవత్సరం గ్రామాన్ని సందర్శించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *