కోటగుళ్ల కు బంగారు అభరణాలు
బహుకరించిన ఎన్ ఆర్ఐ దంపతులు
గణపురం:నేతి ధాత్రి

గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు రూ. ఒక లక్ష 21 వేల విలువైన రెండు బంగారు గొలుసులను గణపురం మండల కేంద్రానికి చెందిన అట్లూరి జగన్ మోహన్ రావు ఉదయలక్ష్మి దంపతుల కూతురు, అల్లుడు అమెరికాలోని కాలిపోర్నియా షానోజ్ లో నివాసం ఉంటున్న ఉయ్యూరు రామకృష్ణ శిల్పా చౌదరి దంపతులు సోమవారం స్వామివారికి అమ్మవారికి బహుకరించారు. మొదట స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం బంగారు అభరణాలను స్వామివారికి అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయానికి బంగారు అభరణాలు అందజేసిన ఎన్ఆర్ఐ దంపతులకు కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.