
భూపాలపల్లి నేటిధాత్రి
మే 1, 2వ తేదీలలో వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో తెలంగాణా కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీలు జరిగాయి. ఈ పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొని పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు సీనియర్ మాస్టర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జయశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటే శ్రీనివాస్ ( మాదాసి ) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భముగా మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రియేటివ్ ఫామ్ వెపన్ విభాగంలో బోగ శ్రీవేణి బంగారు పతకం, తాడబోయిన హరిణి వెండి పతకం, ఐలవేణి నిత్య బంగారు పతకం, ఐలవేణి కుశాంత్ బంగారు పతకం, కంటె భాను మైత్రేయ బంగారు పతకం, పాయింట్ ఫైటింగ్, లైట్ కాంటాక్ట్ విభాగాలలో శ్రీ వైష్ణవి రెండు బంగారు పతకాలు, సంజన శ్రీ రెండు బంగారు పతకాలు, హరిణి రజిత , శ్రీవేణి రజిత పతకం, నిత్య శ్రీ వెండి పతకం, మాదాసి విధిష దేవి రజిత పతకం, కుశాంత్ బంగారు పతకం, భాను మైత్రేయ బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను, సీనియర్ ఇన్స్ట్రక్టర్, కోచ్ గోసిక అశోక్ లను కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్, మాస్టర్ లు ఆవుల రాజనర్సు, శేఖర్, రాజు, తిరుపతిలు ప్రతేకంగా అభినందించినట్లు మాస్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.