
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్. నూతనంగా పదోన్నతి పొంది బదిలీ పై వచ్చిన ఎం. తిరుమలరావు, జిఎం (ఈ&ఎం) సి.హెచ్.పి. కార్పొరేట్ మొదటిసారిగా జిఎం (ఈ&ఎం) సి.హెచ్.పి.గా కొత్తగూడెం ఏరియాలో పర్యటించడం జరిగింది.
ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు.వారిని పుష్పగుచ్చం మరియు శాలువాతో సన్మానించి స్వాగతించారు. తదనంతరం కొత్తగూడెం ఏరియాలోని సి.హెచ్.పి ల పనితీరు వివరములను కొత్తగూడెం ఏరియా ఇంజనీర్ వి.దుర్గాప్రసాద్ వివరించడం జరిగింది. అనంతరం జిఎం (ఈ&ఎం) సి.హెచ్.పి. కార్పొరేట్.జేవిఆర్ సి.హెచ్.పిని సందర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా జిఎంతో పాటు ఎస్ ఓ టు జి ఎం జి వి కోటిరెడ్డి, ఏజీఎం(ఈ&ఎం) వి. దుర్గాప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్, జీకేఓసి ఎం. శ్రీ రమేష్, డిజిఎం (సర్వే) ఎస్. సదానందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.