బిఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి.
ఉప్పల్
23 నవంబర్ (నేటిధాత్రి):
ఉప్పల్ నియోజకవర్గం డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ లో నిర్వహించిన పాదయాత్ర లో గురువారం బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా బండారు లక్ష్మణ్ మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది చెందిందన్నారు.ఒకప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయితే భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందని తెలిపారు.ఉప్పల్ నియోజకవర్గంలో బండారి లక్ష్మారెడ్డిని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని అసోసియేషన్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు.తనకు మద్దతు తెలిపిన అసోసియేషన్ వారికి బండారి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామంటూ, అందుకు ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమ శేకర్ రెడ్డి,స్థానిక కార్పొరేటర్ శిరీష సోమ శేకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామరావు, పావని రెడ్డి,డివిజన్ ప్రెసిడెంట్ కాసం మహిపాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కుమార స్వామి,నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.