
మోకుదెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో పరామర్శ..
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
తాడిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడు గాయాలపాయాలయ్యాడు ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో జరిగింది.గీత కార్మికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మల్లంపల్లి గ్రామానికి చెందిన తడుక రాజు గౌడ్ అనే గీత కార్మికుడు వృత్తిరీత్యా తాడిచెట్టు గ్రామ సమీపంలో ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో గమనించిన తోటి గీత కార్మికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
# తడుక రాజు గౌడ్ ను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి.
కల్లుగీత పని వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు పై నుండి పడి గాయాలపాలైన తడుక రాజు గౌడు కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ చుక్క రమేష్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా రాజును గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తడుక కొమురయ్య గౌడ్, మండల ఉపాధ్యక్షుడు,మల్లంపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు గుండెబోయిన రమేష్ గౌడ్,
మాజీ అధ్యక్షుడు రాజు గౌడ్, కక్కర్ల కుమారస్వామి గౌడ్, మాదారపు మధు గౌడ్, చుక్క రాజేందర్ గౌడ్, కక్కర్ల నవీన్ గౌడ్,చంద్రమౌళి గౌడ్,ప్రశాంత్ గౌడ్,కర్ణాకర్ గౌడ్ పాల్గొన్నారు.