ప్రాణం తీసిన జెనరేటర్..

ప్రాణం తీసిన జెనరేటర్.. నిద్రలోనే కన్నుమూసిన తండ్రీకొడుకులు

 

 

మరుసటి రోజు ఉదయం సెల్వరాజ్ భార్య ఆ ఇంటి దగ్గరకు వెళ్లింది. పలుమార్లు తలుపు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పొరిగింటి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టించి లోపలికి వెళ్లింది.

 

 

 

 

 

 

 

 

గత కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. పగటి పూట కరెంట్ కోత అంతగా బాధించకపోయినా.. రాత్రిళ్లు తప్పని సరిగా విద్యుత్ అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే కరెంట్ కోతలనుంచి తప్పించుకోవడానికి కొంతమంది జెనరేటర్లు వాడుతున్నారు. తాజాగా, ఓ పోర్టబుల్ జెనరేటర్ ముగ్గురి ప్రాణాలు తీసింది.

 

 

 

 

 

 

 

 

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ముగ్గురు తండ్రీకొడుకులు కావటం గమనార్హం. ఈ విషాద సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నైకి చెందిన 57 ఏళ్ల సెల్వరాజ్ తన ఇద్దరు కొడుకులు.. సుమన్ రాజ్ (15), గోకుల్ రాజ్(13)తో కలిసి ఇంట్లో నిద్రపోయాడు. రాత్రి వర్షం కారణంగా కరెంట్ పోవటంతో పోర్టబుల్ జెనరేటర్ ఆన్ చేసి పడుకున్నారు.

 

 

 

 

 

 

 

 

 

మరుసటి రోజు ఉదయం సెల్వరాజ్ భార్య ఆ ఇంటి దగ్గరకు వెళ్లింది. పలుమార్లు తలుపు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పొరిగింటి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టించి లోపలికి వెళ్లింది. అక్కడ ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. వారి నోటి నుంచి నురగలు వస్తూ ఉన్నాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని గవర్నమెంట్ స్టేన్‌లే మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు.

 

 

 

 

 

 

 

 

 

అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో వారిది ఆత్మహత్య కాదని తేలింది. కార్బండ్ మోనాక్సైడ్ కారణంగా వారు చనిపోయినట్లు వెల్లడైంది. జెనరేటర్ నుంచి వెలువడిన కార్బండ్ మోనాక్సైడ్ ముగ్గురి ప్రాణాలు తీసిందని డాక్టర్లు తేల్చారు. జెనరేటర్ కారణంగా ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవటంతో స్థానికంగా కలకలం చెలరేగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!