“Gas Cylinder Blast in Home: Major Mishap Averted”
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన పెను ప్రమాదం
జహీరాబాద్ నేటి ధాత్రి:
అప్పుడప్పుడే తెల్లవారుతుంది. ఆ కుటుంబంలోని ఇంకొంత మంది ఇంకా గాఢనిద్రలోనే ఉన్నారు. ఇంతలోనే భారీ కేకలతో అరుపులు. హఠాత్తుగా నిద్రలోంచి లేచి చూసేసరికి ఇల్లు మొత్తం మంటలు.. సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండల కేంద్రంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది ఈ ఘటన. గ్రామానికి చెందిన ఉబ్ది మల్లమ్మ భర్త రమేష్ బెడ బుడగ జంగం అనే ఇంట్లో అకస్మాత్తుగా సిలిండర్ పేలడంతో ఇల్లు మొత్తం కాలిపోవడం జరిగింది

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లమ్మ ఎప్పటి లాగే ఇంట్లో అందరికన్నా ముందు నిద్రలేచి రోజూ వారీలా గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో మంటలు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు సంభవించింది. మిగత వారు నిద్రలో నుంచి తేరుకుని చుట్టు చుట్టు పక్కల వారు మంటలను అదుపు చెదమన్న మంటలు అదుపు కాకపోవడంతో ఫైర్ స్టేషన్ కు,

పోలీస్(100) కు ఫోన్ చేయడంతో వెంటనె అధికారులు స్పందించి మంటలను అర్పడం జరిగింది ప్రమాదం జరిగినప్పుడు మల్లమ్మ కుమారుడు (4)ఇంట్లో ఉన్నారు వారికీ ఏ ప్రమాదము జరగనందున స్థానికులు ఊపిరి పీల్చుకుని పెద్ద ప్రమాదం తప్పింది స్థానికులు అన్నారు మంటలు చెలరేగడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది పలువురు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆరుపారు వారికి రెండు మూడు లక్షల అంచనాతో ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసారు వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి వితంతు మహిళకు ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు ,
