విద్యార్థుల్లో మానసిక దృక్పథాన్ని పెంపొందించడానికి స్ఫూర్తి కార్యక్రమం
జిల్లాలోని 118 ప్రభుత్వ విద్యా సంస్థల్లో పూర్తి కార్యక్రమం నిర్వహణ
ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన కల్పన
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*
విద్యార్థుల్లో మానసిక దృక్పథాన్ని పెంపొందించడానికి స్ఫూర్తి కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆలోచనల మేరకు విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు గత విద్యాసంవత్సరం నుండి స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది.యూనిసెఫ్, యునెస్కో, డబ్ల్యూహెచ్ఓ, ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న అంశాల ఆధారంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదచే ప్రత్యేకంగా స్ఫూర్తి కార్యక్రమం రూపొందించారు. స్ఫూర్తి కార్యక్రమాల్లో భాగంగా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులలో జీవిత నైపుణ్యాలు, విద్యతో పాటు ఈ వారం స్ఫూర్తి కార్యక్రమంలో ప్రత్యేకంగా
ఆర్థిక అక్షరాస్యపై విద్యార్థుల్లో కల్పించేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలోని 118 ప్రభుత్వ విద్యాసంస్థల్లో స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు.జిల్లాస్థాయి మండల ప్రత్యేక అధికారుల,సంబంధిత విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో అనుభవం కలిగిన విశ్రాంత అధ్యాపకులు,బ్యాంక్ అధికారులు, జర్నలిస్టులు
స్ఫూర్తి కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థుల్లో ఎదురయ్యే సమస్యలు, పోటీ తత్వం, ఓత్తిడిలో సమయం స్ఫూర్తి తదితర అంశాలపై ఒత్తిడిని జయించి సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు విద్యార్థులు ఆర్థిక అక్షరాస్యత పై డబ్బులు ఎలా నిర్వహించాలో, బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహణ,బడ్జెట్ ఎలా వేయాలో, పొదుపు ఎలా చేయాలి.అప్పులు ఎలా తీర్చాలి.తెలివైన పెట్టుబడులు ఎలా పెట్టాలి.ర్ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి ఆర్థిక అక్షరాసత్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు.మంగళవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమాల్లో భాగంగా చెన్నారావుపేట మండల కేంద్రంలో గల దుగ్గొండి మండలం నాచినపల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొనగా,శంభునిపేట తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,రాయపర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,13 మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాలలో స్ఫూర్తి కార్యక్రమాలలో పాల్గొని విద్యార్థులకు హార్థిక అక్షరాస్యతతో పాటు జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాల్లో డిఆర్డిఓ కౌసల్యాదేవి,జడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ దాసరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు,బరిగెల శివ, మండల ప్రత్యేక అధికారులు, ప్రాధానోపాధ్యాయులు, విశ్రాంత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.