Garima Agrawal Assumes Additional Collector Role
అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగ్రవాల్
* ఇంచార్జి కలెక్టర్ గా సైతం..
– సెలవులో వెళ్లిన కలెక్టర్ ఎం హరిత
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరిమా అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి అదనపు కలెక్టర్ చేరుకోగా, అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్ పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరిమా అగ్రవాల్ బాధ్యతలు స్వీకరించారు.
కలెక్టర్ ఎం హరిత సెలవుపై వెళ్లగా, ఇంచార్జి కలెక్టర్ గా సైతం గరిమా అగ్రవాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఏవో రామ్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
