గంగారం,నేటిధాత్రి :
గిరాక తాటి కల్లు పేరు చెప్తే ఎవ్వరికైనా నోరు ఊరల్సిందే పల్లెలనుంచి పట్నం వరకు గిరాక తాటి కల్లు అంటే అమితామైన అభిమానం ఎందుకంటే ఒక చెట్టు నుంచి 40నుంచి 50సిసలా కల్లు దిగుతుంది మాములుగా తాటి చెట్టు నుంచి అయితే 2 సిసలు నుంచి మహా అయితే 8 సిసలా మధ్యలో ఆగుతుంది అదే గిరాక తాటి చెట్లు అయితే ఫ్యూర్ కల్లు గా ఆరోగ్యం నికి అండగా ఉంటుంది అని అభివర్ణించా వచ్చు అటువంటి గిరాక తాటి చెట్లు అరుదు గా ఉంటాయి ఉమ్మడి వరంగల్ జిల్లా లోని ఖానాపూర్ మండలం లో పాఖల చెరువు కట్ట వెనకాల ఈ గిరాక తాటి చెట్లు ఉన్నాయి వేలం పాటలో 18.0000 లక్షల రూపాయలు పడిన రోజుల ఉన్నాయి అటువంటి గిరాక తాటి చెట్లు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని బావురుగొండ
గ్రామాం లో పచ్చని ప్రకృతి అడవిలో వెలిశాయి బావురుగొండ గ్రామం లోని ముడిగా ప్రసాద్ వజ్జ ఇంద్ర కుమార్ మరి కొంత మంది ప్రజలు వారి చెలకలో ఉన్నటువంటి గిరాక తాటికల్లుని వారు మాత్రమే గిరాక తాటి కల్లును గిస్తూ సమీప గ్రామాల ప్రజలకు విక్రయస్తుంటారు పల్లె ప్రజలే కాక పట్నం వాసులుకూడా దివ్య ఔషధంగా భావిస్తు సేవిస్తుంటారు . ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే పూర్వీకులు గిరాక తాటిచెట్టుని కల్పవృక్షంగాచెప్పేవారు. ప్రతి ఆరోగ్య సమస్యకి కల్లు ద్వారానే పరిష్కారం వెతుక్కునేవారు. కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. కానీ ఏదైనా అతిగా సేవిస్తే ప్రమాదమే ఈ షరతు గిరాక తాటికల్లుకి కూడా వర్తిస్తుంది. అయితే గిరాక తాటికల్లుని ఎప్పుడు తాగాలి. ఏ సమయంలో తాగితే మంచిదో అనేక విషయాలు తెలుసుకుందాం. అప్పుడే చెట్టు నుంచి తీసిన గిరాక తాటికల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారకాన్ని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చెట్టు నుంచి తీయగానే తాగితే ఈ ఫలితాలు అందుతాయి. కొన్ని గంటలు తర్వాత తాగితే అది పులిసిపోయి ఆల్క్‌హాల్‌గా మారిపోతుంది. దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం. అందుచేత చెట్టు నుంచి తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. గిరాక తాటికల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు గిరాక తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.
నగరాలు, పట్టణాలలో నివసించే ప్రజలు ప్రతిరోజు మసాల ఆహారాలు, జంక్ ఫుడ్స్ వంటివి తీసుకుంటారు. దీంతో ఉదర సమస్యలతో బాధపడుతారు. అలాంటి వారికి గిరాక తాటికల్లు ఒక దివ్య ఔషధమని చెప్పవచ్చు. కల్లులో ఉండే గుణాలు కడుపుని క్లీన్ చేస్తాయి. అందుకే చాలామంది ఒక్కసారైనా గిరాకతాటి కల్లు తాగాలని అనుకుంటారు. గిరాకతాటిచెట్టు ఒక్క కల్లు మాత్రమే కాదు చాలా అవసరాలకి ఉపయోగపడుతుంది. తాటాకులతో గుడిసెలు వేసుకుంటారు. చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు తయారు చేసుకుంటారు. తాటిచెట్టు కలప కూడా గట్టిగా ఉంటుంది. ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడుతుంది.
గంగారం లో గిరాక తాటి కల్లు ఫుల్
