తాను సంకల్పించి చేసిన యాత్ర ఎన్నో జన్మల పుణ్యo. గండ్ర జ్యోతి
భూపాలపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి మంజూరు నగర్ లో లోక కళ్యాణార్ధం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, గండ్ర జ్యోతి దంపతులు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణాంతరం, స్వామి వారి ప్రతిష్టాపన అనంతరం వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి భూపాలపల్లి నుండి తిరుమల తిరుపతి వాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వస్తానని సంకల్పించుకుని,జనవరి 20 వ తారీఖున భూపాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి బయలు దేరిన గండ్ర జ్యోతి ఈ నెల 24 వెంకన్న స్వామి కొండకు చేరుకుని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుండి తనతో తీసుకెళ్లిన జెండాను స్వామి వారి పాదాల వద్ద ఉంచిన జెండాను తీసుకు వచ్చి భూపాలపల్లి మంజునగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పై అవుస్కరించారు
ఈ సందర్భంగా గండ్ర దంపతులు మాట్లాడుతూ.
లోక కళ్యాణార్ధం నిర్మించి,స్వామి ప్రతిష్ట చేసుకున్న భూపాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి జనవరి 20 వ తారీఖున నేను సంకల్పించుకున్న భూపాలపల్లి నుండి తిరుపతి పాదయాత్ర ను దాదాపు 25 రోజుల్లో దాదాపు 680 కిలోమీటర్లు నడుచుకుంటూ నిన్న ఆ శ్రీవారి సన్నిధి చేరుకుని నా మొక్కు తీర్చుకోవడం జరిగింది.
మరి నేను పాదయాత్ర చేస్తూ తిరుపతి ప్రయాణము కొనసాగించిన తరుణంలో నాకు తోడుగా శంకర్,ప్రేమ్, తిరుపతి,రమేష్, అరవింద్, కార్తీక్ లను ఆ దేవుడే పంపించాడు అని అనుకుంటున్న, ఎందుకంటే మీరు నాతో రండి అని వారిని పిలవలేదు , వారే నాతో పాటు నా పాదయాత్రలో భాగమై నా వెంట ఉండి నడిపించడం చాలా సంతోషకరమైన విషయం,వారితో పాటు భూపాలపల్లి నియోజకవర్గం నుండి రాంశెట్టి లత, గాయపు శ్రీమాల, తిరుపతమ్మ, స్వప్న, పద్మ,సుజాత మరి ఈ పాదయాత్రలో భాగం కావడం అంత ఆ వెంకన్న స్వామి దయ అని తెలిపారు.
మరి మా ఈ 25 రోజుల పాదయాత్రలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు మా పాదయాత్ర గురించి తెలుసుకుని మాకు స్వాగతం తెలియచేయడం తో పాటు మేము మధ్యాహ్నం, సాయంత్రం బస చేయడం కొరకు మాకు ఆశ్రయం ఇవ్వడం తో పాటు మాకు అన్నివిధాల సహకరించిన ప్రతి ఒక్కరికి,హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అదే విధంగా మా పాదయాత్ర విజయాన్ని ఆకాంక్షించి నన్ను సాగనంపి,తిరిగి మేము తిరుపతి నుండి భూపాలపల్లి చేరే వారికి చేరే వరకు మాకు నిరంతరం మా మంచి చెడ్డ విషయాలపై వాకబు చేస్తూ,మాకు మనోధైర్యం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజానీకం మరియు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు..
ఈ పాదయాత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం,మంచి అనుభూతులు పొందడం జరిగింది.
ఈ రోజు మేము పాదయాత్ర గా వెళ్ళిన మార్గంలో తిరుపతి నుండి భూపాలపల్లి వస్తున్నప్పుడు పాదయాత్రలో మేము కలిసిన వారిని,ఆ రోజు జరిగిన సంఘటనలు తలుచుకుంటూ వస్తుంటే అది ఎంతో ఆనందాన్ని, మరిచిపోలేని,తిరిగిరాని మధురస్మృతులను పొందడం అంత ఆ భగవంతుడి లీల అని తెలిపారు….