*పొదెం వీరయ్య చైర్మన్, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్*
భద్రాచలం : నేటి ధాత్రి
భారత జాతిపిత గాంధీ మార్గం అనుసరణీయమని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య వ్యాఖ్యానించారు. గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం భద్రాచలం పట్టణంలోని కూరగాయ మార్కెట్ సెంటర్ లో గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ…భారత జాతీయ ఉద్యమంలో గాంధీజీ నిర్వహించిన పాత్రను గుర్తు చేశారు. బ్రిటిష్ దాస్య శృంకలాల నుంచి భరతమాత విముక్తి కోసం గాంధీజీ నిర్వహించిన పోరాటం ప్రశంసనీయమన్నారు.
ప్రధానంగా గాంధీ గారు నిర్వహించిన సత్యాగ్రహం, అహింసా విధానం ఆదర్శప్రాయమన్నారు. గాంధీజీ బాటలో నేటి తరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు చింతిర్యాల రవికుమార్ గారు, కురిచేటి శ్రీనివాస్, తమ్మల్ల వెంకటేశ్వర్లు, యడారి ప్రదీప్, కొల్లపూడి వరుణ్, శేషు, పందాల సరిత, రామ్ ప్రసాద్, శీలం రామ్మోహన్ రెడ్డి, బసవరాజు, కాపుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.